![]() |
![]() |
.webp)
ప్రతీ వారం లానే ఈ వారం జబర్దస్త్ షో ప్రోమో రిలీజ్ అయింది. ఈ షోలో ఎప్పటిలాగే రాకెట్ రాఘవ కామెడీ స్కిట్ హిలేరియస్ గా అలరించింది. ఈ వారం ఏమయ్యిందో కానీ అన్ని స్కిట్స్ లో కామెడీ వరదైపొంగేలా కనిపిస్తోంది. ఐతే ప్రోమో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాగా నవ్వు తెప్పించింది కానీ ప్రోమో లాస్ట్ లో మాత్రం ఆడియన్స్ ని ఏడిపించేసింది.. ఇంతకు విషయం ఏమిటి అంటే ఇంద్రజ చెప్పిన షాకింగ్ న్యూస్ ...దాంతో కమెడియన్స్ ఫేసులు వాడిపోయాయి. ఇంద్రజ మాట్లాడుతుండగానే ఏడ్చేసింది. "జబర్దస్త్ లో ఒక చిన్న గ్యాప్ ఐతే తీసుకుంటున్నాను." అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. వెంటనే ఆమె కొడుకులా చూసుకునే నూకరాజు మాట్లాడాడు "ఫస్ట్ టైం ఇండస్ట్రీ చరిత్రలో మన పేర్లు మారింది కేవలం జబర్దస్త్ వల్లే..." అన్నాడు. ఇక ఫైనల్ గా ఇంద్రజ వెళ్తూ వెళ్తూ తన జబర్దస్త్ ఫామిలీ మొత్తంతో ఫోటో దిగింది. ఇలా నెక్స్ట్ వీక్ నుంచి ఇంద్రజ షోలో కనిపించే ఛాన్స్ లేదని క్లియర్ గా తెలుస్తోంది. ఐతే ఇంద్రజ 2021 మే నుంచి ఆమె జబర్దస్త్ జడ్జ్ గా రోజా ప్లేస్ లో వచ్చిన విషయం తెలిసిందే.
అప్పటినుంచి ఇప్పటి వరకు ఆమెకు జబర్దస్త్ టీమ్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్ తో మంచి బాండింగ్ ఐతే ఏర్పడింది. ఇక నూకరాజు ఆమె మీద చిన్న కవిత లాంటిది కూడా తన బుర్ర కథ స్కిట్ లో చెప్పుకొచ్చాడు. ఇక ఇంద్రజ కనిపించదు అని ప్రోమోలో చెప్పేసరికి నెటిజన్స్ కూడా బాధపడుతున్నారు. అలాగే ఇక ఈ షోకి మళ్ళీ జడ్జ్ గా రోజా గాని వచ్చేస్తుందా ఏమిటి ? అంటూ అడుగుతున్నారు. మరి ఇంద్రజ ప్లేస్ ఎవరు వస్తారు అనే విషయం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సు గా ఉంది. నెక్స్ట్ వీక్ ఎప్పుడొస్తుందా ... జడ్జ్ ఎవరు వస్తారా ? అని ఆడియన్స్ కూడా తెగ ఎదురుచూస్తున్నారు. చూడాలి ఎవరొస్తారో.
![]() |
![]() |